గ్రూప్ 1పేపర్ లీక్ లో కాఖీ కొడుకు
పట్టుకున్న ఏపీ పోలీసులు
అమరావతి – టెక్నాలజీ ఎంతగా విస్తరించినా, పకడ్బందీగా చర్యలు చేపట్టినా మోసాలు, నేరాలు, ఘోరాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ఖాకీ కొడుకు నిర్వాకం బట్ట బయలు కావడం విస్తు పోయేలా చేసింది. పరీక్ష హాలులో ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్నా పత్రాన్ని స్కానింగ్ చేశాడు. ఈ సందర్బంగా పోలీసుల కంట పడి పట్టుబడ్డాడు.
ఈ ఘటన ఏపీలోని ఒంగోలులో చోటు చేసుకుంది. మార్చి 17న గ్రూప్ -1 ప్రిలిమ్స్ కోసం పరీక్ష జరిగింది. ఈ పరీక్షలో కాపీ కొట్టేందుకు ప్రయత్నం చేశాడు. ఊహించని రీతిలో దొరికి పోయాడు. శివ శంకర్ అనే అభ్యర్థి పల్నాడు జిల్లాకు చెందిన వాడు. ఇతడి తండ్రి ఎవరో కాదు సర్కిల్ ఇన్స్ పెక్టర్ కుమారుడు.
విచిత్రం ఏమిటంటే తను ఐ ఫోన్ ను ఉపయోగించాడు. స్కాన్ చేసేందుకు ప్రయత్నించినట్లు విచారణలో తేలింది. ఎంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినా ఎలా ఫోన్ ను లోపలికి తీసుకు వెళ్లారనేది విస్తు పోయేలా చేసింది. ఈ విషయం గురించి మరో విద్యార్థి ఫిర్యాదు చేయడంతో ఈ లీక్ వెల్లడి కావడంతో అవాక్కయ్యారు విద్యార్థులు.
ఈ సందర్బంగా స్కాన్ చేసిన శివ శంకర్ ను పరీక్ష కేంద్రం నుంచి బహిష్కరించారు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ. పోలీసులకు అప్పగించారు. అయితే శివ శంకర్ తన ఐ ఫోన్ పాస్ వర్డ్ ను వెల్లడించేందుకు నిరాకరించడం విశేషం.