NEWSTELANGANA

డ్ర‌గ్స్ టెస్ట్ లో ముగ్గురికి పాజిటివ్

Share it with your family & friends

సీపీ అవినాష్ మ‌హంతి

హైద‌రాబాద్ – హైద‌రాబాద్ లో డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డ‌టం క‌ల‌కలం రేపింది. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ వ్యాపారాల్లో భాగ‌స్వామిగా ఉన్న కేదార్ నాథ్ కూడా ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా హైద‌రాబాద్ గచ్చిబౌలి లోని రాడిసన్ హోటల్‌పై పోలీసులు ఆక‌స్మిక దాడులు జ‌రిపారు. ఈ దాడుల్లో ప‌లువురు ప‌ట్టుబ‌డ్డార‌ని చెప్పారు సీపీ అవినాష్ మహంతి.

రాడిసన్ బ్ల్యూ హోటల్‌పై ఎస్‌ఓటీ పోలీసులతో దాడి చేశామని సీపీ తెలిపారు. హోటల్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందిందని, ఆ మేర‌కు సెర్చ్ చేశామని చెప్పారు. అప్పటికే హోటల్ నుంచి నిందితులు పరారు అయ్యారని తెలిపారు.

కొంత సమాచారంతో రాడిసన్ డైరెక్టర్ వివేకానంద ఇంటికి వెళ్ళామని చెప్పారు సీపీ . వివేకానంద మంజీర గ్రూప్‌కి డైరెక్టర్‌గా ఉన్నాడని వెల్లడించారు.ఇదిలా ఉండ‌గా ఇంటికి వెళ్లిన సమయంలో పోలీసులకు విచారణకు సహకరించకుండా కొంత ఇబ్బంది పెట్టారని అన్నారు.

వివేకానందను అదుపు లోకి తీసుకొని డ్రగ్స్ టెస్ట్ చేశామని అవినాష్ మహంతి వెల్లడించారు. వివేకానందతో పాటు నిర్భయ్ , కేదార్‌కు పాజిటివ్ వచ్చిందని స్ప‌ష్టం చేశారు.