స్పష్టం చేసిన సీపీ అవినాష్ మహంతి
హైదరాబాద్ – హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సంచలన ప్రకటన చేశారు. ఈనెల 14న శుక్రవారం హోలీ పండుగ సందర్బంగా నియమ నిబంధనలు విధించడం జరిగిందని తెలిపారు. నగరవాసులు వీటిని తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. ఇందు కోసం ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ శనివారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు విధించినట్లు స్పష్టం చేశారు సీపీ. హోలీ పండుగ సందర్బంగా రోడ్డు మీద వెళ్లే వారిపై పనిగట్టుకుని రంగులు చల్లితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
రోడ్లపై గుంపులు గుంపులుగా ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. గీత దాటితే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు అవినాష్ మహంతి. హోలీ పండుగ పేరుతో చిల్లర వేషాలు వేస్తూ ఊరుకో బోమంటూ పేర్కొన్నారు. తాజాగా సీపీ చేసిన హెచ్చరికలతో నగరవాసులు లబోదిబోమంటున్నారు. మరో వైపు పండుగ పేరుతో ఇప్పటికే ఈవెంట్స్ ను నిర్వహించేందుకు ఎప్పటి నుంచో ప్లాన్స్ చేస్తున్నారు. వీరిందరికీ కోలుకోలేని షాక్ ఇచ్చారు సిటీ పోలీస్ కమిషనర్. ఎవరైనా సరే గీత దాటాలని ప్రయత్నం చేస్తే జైలుపాలు కాక తప్పదని వార్నింగ్ ఇచ్చారు.