హైదరాబాద్ లో రెడ్ అలర్ట్
పెద్ద ఎత్తున తనిఖీలు
హైదరాబాద్ – కర్ణాటకలోని బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రతి చోట పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
ఇదిలా ఉండగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సెక్యూరిటీపై ఫోకస్ పెట్టారు. సీపీ ఆదేశాల మేరకు పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్టు సీపీ వెల్లడించారు.
ఇందులో భాగంగా హైదరాబాద్ లోని పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. జూబ్లీ హిల్స్ బస్టాండ్ , మహాత్మా గాంధీ బస్ స్టేషన్ , అమీర్ పేట్ , ఎల్బీ నగర్ , ఆబిడ్స్ , కోఠి, సుల్తాన్ బజార్ , మెహిదీపట్నం, బంజారా హిల్స్ , కూకట్ పల్లి, మాదాపూర్ , గచ్చి బౌలి, శంషా బాద్ , హస్తినా పురం, సాగర్ రింగ్ రోడ్, చార్మినార్ , చాంద్రాయణ్ గుట్ట, సంతోష్ నగర్ , సైదాబాద్ , ఉప్పల్ , సికింద్రాబాద్ , తదితర ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
కొన్ని చోట్ల బారికేడల్ను ఏర్పాటు చేశారు. అనుమానస్పద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వ్యక్తులను పరిశీలిస్తున్నారు.