కొలువు తీరిన కొత్త గవర్నర్
ప్రమాణ స్వీకారం చేయించిన సీజే
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా కొలువు తీరారు సీపీ రాధాకృష్ణన్. బుధవారం ఎన్నికల కోడ్ ఉండడంతో ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా ఉన్న ఆయనకు తెలంగాణ రాష్ట్రంతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ సందర్బంగా రాధాకృష్ణన్ ను నామినేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసింది.
ఎన్నికల కోడ్ ఉండడంతో కొత్తగా ఎవరినీ నియమించేందుకు వీలు లేదు. అలా అయితే భారత రాజ్యాంగం ధిక్కరణ కిందకు వస్తుంది. దీంతో గత్యంతరం లేక మోదీ సర్కార్ మరోసారి తమిళనాడుకు చెందిన వ్యక్తినే తెలంగాణకు నియమించింది.
ఇదిలా ఉండగా బుధవారం హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఇన్ చార్జ్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు రాధాకృష్ణన్. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులు సైతం పాల్గొన్నారు.