రాహుల్ కు సీపీఐ ఝలక్
వాయనాడులో అభ్యర్థి ప్రకటన
న్యూఢిల్లీ – ఏఐసీసీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది సీపీఐ పార్టీ. అయితే తాజాగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పొత్తులో భాగంగా తమ పార్టీ తరపున ఏకంగా అభ్యర్థిని ఖరారు చేసింది. దీంతో ఖంగు తిన్నారు రాహుల్ గాంధీ. ఆయన ఓ వైపు భారత్ జోడో న్యాయ్ యాత్రకు శ్రీకారం చుట్టారు. కేంద్ర సర్కార్ ను ఏకి పారేస్తున్నారు.
ఇప్పటికే ఇండియా కూటమిలో లుకలుకలు బయలు దేరాయి. ఇండియా కూటమికి ఆయువుపట్టుగా ఉన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ జంప్ అయ్యారు. ఆయన మళ్లీ బీజేపీతో జత కట్టారు. ఇదే సమయంలో టీఎంసీ చీఫ్ , పశ్చి మ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గుడ్ బై చెప్పారు.
దీంతో కూటమిలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది. ప్రస్తుతం ఇండియా కూటమికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ తరుణంలో పొత్తు ధర్మాన్ని పాటించకుండా సీపీఐ అభ్యర్థిని ఖరారు చేయడంపై ఆరా తీశారు ఖర్గే.
ఇదిలా ఉండగా రాజీవ్ గాంధీకి తెలియకుండా ఆయన ఎంపీగా ఉన్న వాయనాడు స్థానానికి సీపీఐ పార్టీ ప్రధాన కార్యదర్శి డి. రాజా భార్య అన్నీ రాజాను ఖరారు చేయడం విస్తు పోయేలా చేసింది.