NEWSANDHRA PRADESH

నీట్ ప‌రీక్ష లీకేజీపై విచార‌ణ చేప‌ట్టాలి

Share it with your family & friends

సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కె. రామ‌కృష్ణ

అమ‌రావ‌తి – కేంద్ర బీబీపీ స‌ర్కార్ నిర్వాకం కార‌ణంగానే ఇవాళ తొలిసారిగా నీట్ లో అవ‌క‌త‌వ‌క‌లు చోటు చేసుకున్నాయ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కె. రామ‌కృష్ణ‌. వెంట‌నే కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు.

ఈ దేశంలో అధికారం ఉంది క‌దా అని అక్ర‌మాల‌కు పాల్ప‌డుతూ పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. నీట్ ప‌రీక్ష‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ అధికారంలో ఉన్న రాజ‌స్థాన్, మ‌ధ్య ప్ర‌దేశ్, హ‌ర్యానా రాష్ట్రాల‌కు చెందిన విద్యార్థులే టాప్ లో ఎలా వ‌స్తారంటూ ప్ర‌శ్నించారు. దీని వెనుక బిగ్ స్కామ్ దాగి ఉంద‌న్నారు కె. రామ‌కృష్ణ‌.

రూ. 30 ల‌క్ష‌ల‌కు నీట్ ప్ర‌శ్నా ప‌త్రం అమ్మ‌డం వైద్య ,విద్యార్థుల జీవితాల‌తో ఆట ఆడుకోవ‌డం త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. బీహార్ కు చెందిన ముఠా ఒక్కో విద్యార్థి నుంచి భారీ ఎత్తున వ‌సూలు చేసింద‌న్నారు. ఎన్న‌డూ లేని విధంగా 67 మంది స్టూడెంట్స్ కు 720 మార్కుల‌కు 720 మార్కులు వ‌చ్చాయ‌ని దీనిపై విచార‌ణ జ‌ర‌గాల‌న్నారు రామ‌కృష్ణ‌.