భూ కుంభకోణాలపై విచారణ చేపట్టాలి
సీఎంను కలిసిన సీపీఐ నేతలు డిమాండ్
అమరావతి – గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ నేతృత్వంలోని బృందం. బుధవారం అమరావతి లోని సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. ఈ సందర్బంగా భూ స్కామ్ లకు సంబంధించి విచారణ కోరుతూ సుదీర్ఘ లేఖ అందజేశారు.
అంతే కాకుండా భూ స్కామ్ తో పాటు మూడు రాజధానుల పేరుతో మోసం చేశారంటూ ఆరోపించారు. విశాఖపట్నం, విజయ నగరం, ప్రకాశం జిల్లాలో వేలాది ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని తెలిపారు. వారిని గుర్తించి చట్ట ప్రకారం శిక్షించాలని సీపీఐ నేతల బృందం సీఎంను కోరారు.
గత ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారంటూ ఆరోపించారు. ఇదే సమయంలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ప్రధానంగా ప్రభుత్వ భూములపై కన్నేశారని, వాటిని తమ అనుచరులకు కట్టబెట్టాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.