డిమాండ్ చేసిన సీపీఐ కార్యదర్శి నారాయణ
అమరావతి – సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఏయే పార్టీకి ఎన్నెన్ని రూపాయలు ఎవరెవరి ద్వారా వచ్చాయో ఈ దేశానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే దొంగలు తప్పించుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
మంగళవారం నారాయణ కీలక ప్రకటన విడుదల చేశారు. అనామక దాతలకు సంబంధించిన మొత్తం డేటాను ఎన్నికల బాండ్ల ద్వారా సమర్పించేలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ రాజ్యాంగ బద్ధమైన సంస్థ అని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించేలా దాని అనుబంధ సంస్థకు అవసరమైన ఆదేశాలు ఇవ్వాల్సిన బాధ్యత ఆర్బీఐపై ఉందని స్పష్టం చేశారు సీపీఐ నారాయణ.
మార్చి 6వ తేదీ లోగా డేటాను సమర్పించాలని కోరారు. అయితే జూన్ 30లోగా సమర్పించాలని భారత సుప్రీంకోర్టు ఎస్‌బిఐని కోరిందని, ఇది తప్పించు కునేందుకు దోహదం చేసేలా ఉందన్నారు.
ఎన్నికల బాండ్ల ద్వారా అధికార పార్టీ బీజేపీ మొత్తం ఎన్నికల బాండ్లలో 55 శాతం సంపాదించినట్లు తెలిపారు.