బండారు ఆహ్వానం నారాయణ తిరస్కరణ
మాజీ ప్రొఫెసర్ ఎన్ సాయి బాబా మరణం
హైదరాబాద్ – మాజీ ప్రొఫెసర్ ఎన్. సాయి బాబా మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇదిలా ఉండగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రతి ఏటా హైదరాబాద్ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా తాను నిర్వహించే అలయ్ బలయ్ కు హాజరు కావాలని తనను ఆహ్వానించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూనే కీలక ప్రశ్నలు సంధించారు.
ఈ సందర్బంగా నారాయణ బండారు దత్తాత్రేయకు సుదీర్ఘ లేఖ రాశారు. నా రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం మీరు నన్ను ఆహ్వానిస్తున్న మీ “అలయ్ బలయ్” కార్యక్రమానికి నేను హాజరు కాలేనందుకు క్షమించండి. ఆహ్వానానికి ధన్యవాదాలు.
కానీ మీకు తెలిసినట్లుగా ప్రొ. ప్రముఖ మేధావి , ఢిల్లీలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అయిన సాయిబాబా 90 శాతం ఆర్థోపెడికల్ ఛాలెంజ్‌తో ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం అరెస్టు చేసిందని ఆరోపించారు సీపీఐ నారాయణ.
విచారణలో హక్కు అయిన బెయిల్ కూడా తిరస్కరించడం దారుణమన్నారు. చివరకు 10 ఏళ్ల తర్వాత గౌరవ న్యాయస్థానం అతన్ని నిర్దోషిగా నిర్ధారించిందని గుర్తు చేశారు. తాను , తన పార్టీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా రాజకీయాలను అంగీకరించక పోవచ్చు, కానీ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందన్నది వాస్తవం అని స్పష్టం చేశారు సీపీఐ నారాయణ.
చివరికి రాష్ట్రం ఈ ప్రపంచం నుండి దూరం చేసిందనడంలో సందేహం లేదన్నారు. మీరు పెద్దమనిషి అయితే చివరికి మీరు అతని మరణానికి దారి తీసిన అదే ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు కానీ నిరసనగా మీరు నిర్వహించే కార్యక్రమానికి నేను హాజరు కాలేనంటూ వెల్లడించారు నారాయణ.