ENTERTAINMENT

ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చివేత‌ స‌బ‌బే – నారాయ‌ణ

Share it with your family & friends

నాగార్జున న‌టుడే కావ‌చ్చు..క‌క్కుర్తి ఎందుకు

హైద‌రాబాద్ – సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం నియ‌మించిన హైడ్రాను స‌మ‌ర్థించారు.

అక్కినేని నాగార్జున‌కు చెందిన అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను కూల్చి వేయ‌డం స‌బ‌బేన‌ని అన్నారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం క‌రెక్టేన‌ని చెప్పారు. ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చి వేయ‌డంపై స్టే ఇవ్వ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు.

గ‌తంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం బుస కొట్టింద‌ని, ఆ త‌ర్వాత సైలెంట్ అయ్యింద‌న్నారు. తర్వాత సైలెంట్ అయ్యింద‌ని మండిప‌డ్డారు సీపీఐ నారాయ‌ణ‌. అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను రేవంత్ రెడ్డి కూల్చి వేయ‌డం మంచిద‌ని పేర్కొన్నారు.

అయితే అక్కినేని నాగార్జున‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆయ‌న మంచి న‌టుడే కావ‌చ్చు కానీ క‌క్కుర్తి ఎందుకు అని ప్ర‌శ్నించారు. సినిమా డైలాగులు కొట్ట‌డం కాదు బుకాయింపు మాట‌లు వ‌ద్ద‌న్నారు సీపీఐ నారాయ‌ణ‌. ప్ర‌స్తుతం నారాయ‌ణ చేసిన ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.