పరువు లేనోడు అక్కినేని నాగార్జున
నిప్పులు చెరిగిన సీపీఐ నారాయణ
హైదరాబాద్ – సీపీఐ జాతీయ కార్యదర్శి కొనకళ్ల నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జును ఏకి పారేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. విచిత్రం ఏమిటంటే పరువు లేనోడు నాగార్జున పరువు నష్టం దావా వేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.
బిగ్ బాస్ షో ద్వారా జనానికి ఏం చెప్ప దల్చుకున్నారో చెప్పాలన్నారు సీపీఐ నారాయణ. తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను టార్గెట్ చేయడం తనను విస్తు పోయేలా చేసిందంటూ ఎద్దేవా చేశారు.
పరువు ఉంటేనే పరువు నష్టం దావా వేయాలి..కానీ పరువే లేని అక్కినేని నాగార్జున దావా వేయడం చిత్రంగా ఉందన్నారు సీపీఐ నారాయణ. బిగ్ బాస్ షో చేస్తూ యువతులు, బాలికలు, మహిళలు సిగ్గు పడేలా చేశారని మండిపడ్డారు.
తనంతకు తానే పరువు పోగొట్టుకున్న నాగార్జునకు ప్రశ్నించే హక్కు, పిటిషన్ దాఖలు చేసే హక్కు లేదన్నారు సీపీఐ నారాయణ. కొండా సురేఖ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేసే హక్కు నటి సమంతకు మాత్రమే ఉందని, నారాయణకు రాలేదన్నారు.