చంద్రబాబు నైజం మోసం
సీపీఐ రామకృష్ణ కామెంట్స్
అమరావతి – సీపీఐ రామకృష్ణ నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. శాసన సభ , పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామంటూ మాట ఇచ్చారని అన్నారు. ఆయన తమను గత 5 సంవత్సరాల పాటు వెంట తిప్పుకున్నారని ఆరోపించారు.
తీరా సమయం వచ్చాక అధికారం కోసం ఢిల్లీకి వెళ్లి సాగిల పడ్డాడంటూ ఆరోపించారు. ఎవరి ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు చంద్రబాబు నాయుడు బీజేపీ పెద్దల వద్దకు వెళ్లాడంటూ ప్రశ్నించారు సీపీఐ రామకృష్ణ.
అమరావతి ఉద్యమ సమయంలో కూడా తాము తెలుగుదేశం పార్టీకి తోడు నీడగా ఉన్నామని చెప్పారు. అవసరం కోసం వాడుకుని ఇప్పుడు తమతో పని లేదని బీజేపీ పంచన చేరాడంటూ ధ్వజమెత్తారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు పక్కా అవకాశవాది, తమను మోసం చేశాడంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో ఎవరు వచ్చినా జనానికి ఒరిగేది ఏమీ ఉండదన్నారు.