చరిత్ర సృష్టించిన క్రిష్టియానో రొనాల్డో
వన్ బిలియన్ అనుచరులతో రికార్డ్
హైదరాబాద్ – ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న అరుదైన ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో. తనకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వేల కోట్ల వాల్యూ కలిగిన ప్లేయర్ గా గుర్తింపు పొందాడు. తాజాగా అరుదైన ఘనతను స్వంతం చేసుకున్నాడు.
ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు వన్ బిలియన్ అనుచరులను సంపాదించాడు క్రిష్టియానో రొనాల్డో. ఈ విషయాన్ని ప్రముఖ సామాజిక వేదిక ట్విట్టర్ ఎక్స్ వేదికగా సెప్టెంబర్ 13న శుక్రవారం ప్రకటించాడు. ఆటలోనే కాదు సామాజిక మాధ్యమాలలో కూడా తనకు ఎదురే లేదని చాటాడు రొనాల్డో.
కళ్లు చెదిరే ఆట తీరుతో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశాడు ఫుట్ బాల్ ఆటగాడు. ఒన్ బిలియన్ల మంది అభిమానులు అనుసరించడం పట్ల సంతోషంగా ఉందన్నాడు.
ఇది కేవలం సంఖ్య కంటే ఎక్కువ. ఇది ఆట కానే కాదు అంతకు మించిన భాగస్వామ్యంతో కూడిన అభిరుచి..ప్రేమకు నిదర్శనమని స్పష్టం చేశాడు క్రిష్టియానో రొనాల్డో.
మదీరా వీధుల నుండి ప్రపంచంలోని అతిపెద్ద వేదికల వరకు, తాను ఎల్లప్పుడూ కుటుంబం కోసం , మీ కోసం ఆడానంటూ తెలిపాడు.
నన్ను నమ్మినందుకు, మీ మద్దతు కోసం , నా జీవితంలో భాగమైనందుకు ధన్యవాదాలు తెలిపారు. కలిసి ముందుకు సాగుతూ, గెలుస్తూ, చరిత్ర సృష్టిస్తామని స్పష్టం చేశాడు రొనాల్డో.