12న మహిళా సదస్సు
సీఎస్ శాంతి కుమారి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 12న సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర మహిళా సదస్సు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. దాదాపు లక్ష మందికి పైగా మహిళలు పాల్గొంటారని వెల్లడించారు సీఎస్. మహిళా సంఘాలు కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నాయని పేర్కొన్నారు. ఇందులో విశిష్ట సేవలు అందిస్తూ వచ్చిన పలువురు మహిళలను గుర్తించి ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు సీఎస్ శాంతి కుమారి.
తమ ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రయారిటీ ఇస్తుందని పేర్కొన్నారు. కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వం మహిళా సంఘాలకు ప్రోత్సాహం కల్పిస్తుందని తెలిపారు సీఎస్. మహిళలకు అండగా ఉండేలా అనేక పథకాలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు.
మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు శాంతి కుమారి. లక్ష మందికి పైగా మహిళలు రానున్నారని ఆశా భావం వ్యక్తం చేశారు సీఎస్.