అశ్విన్ సేవలు సీఎస్కేకు అవసరం
హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కామెంట్స్
జెడ్డా – టాటా మెగా ఐపీఎల్ వేలం 2025కి సంబంధించి తొలి రోజు ముగిసింది. మొత్తం 10 ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. రూ. 467.95 కోట్లు ఖర్చు చేశాయి. 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ప్రస్తుతం 2వ రోజు వేలం పాట కొనసాగనుంది. ఇంకా ప్రధాన ఆటగాళ్లు మిగిలి ఉన్నారు.
తొలి రోజు జరిగిన వేలం పాటలో ఊహించని రీతిలో చెన్నై సూపర్ కింగ్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది రవిచంద్రన్ అశ్విన్ ను . సామాన్యంగా ఆ మేనేజ్ మెంట్ ఎక్కువగా ఖర్చు పెట్టదు. రూ. 9 కోట్లకు పైగా వెచ్చింది ఈ స్పిన్నర్, ఆల్ రౌండర్ పై.
తనను ఎందుకు తీసుకున్నామనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు హెడ్ కోచ్ ఫ్లెమింగ్. జట్టుకు ఆల్ రౌండర్ గా పనికి వస్తాడని ఫోకస్ పెట్టామన్నారు. అందుకే భారీ ధరకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని తెలిపాడు. వేలం పాట ముగిసిన అనంతరం స్టీఫెన్ ఫ్లెమింగ్ మీడియాతో మాట్లాడారు.
అదేమంత పెద్ద ధర కాదని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా రవిచంద్రన్ అశ్విన్ 2009లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున అరంగేట్రం చేశాడు. 2010, 2011లో జట్టు టైటిల్ విజేతగా నిలవడంలో కీలకంగా నిలిచాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ , పూణె సూపర్ జెయింట్స్ (ముంబై ) ఢిల్లీ క్యాపిటల్స్ , రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు.