జూలు విదిల్చిన చెన్నై
కోల్ కతా జోరుకు బ్రేక్
చెన్నై – ఐపీఎల్ 2024లో భాగంగా వరుస విజయాలతో దూసుకు పోతున్న కోల్ కతా నైట్ రైడర్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది రుతురాజ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్. రవీంద్ర జడేజా మాయా జాలంతో ఆ జట్టు గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. చెన్నై లోని చెపాక్ మైదానంలో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ ఆద్యంతమూ ఆసక్తికరంగా మారింది.
ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లలో ఓటమి మూట గట్టుకున్న చెన్నైకి ఓదార్పు విజయాన్ని నమోదు చేసింది. ఇక పాయింట్ల పట్టికలో సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్ల పట్టికలో నెంబర్ 1లో ఉంది.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ కు చెందిన బౌలర్లు జడ్డూ , రెహ్మాన్ , తుషార్ దేశ్ పాండేలు అద్బుతమైన బంతులతో ఆకట్టుకున్నారు. ఇక రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఏకంగా 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది.
జడేజా 18 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. తుషార్ 33 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీస్తే ముస్తాఫిజార్ రెహ్మాన్ 22 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 రన్స్ మాత్రమే చేసింది.
అనంతరం చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 141 రన్స్ చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 9 ఫోర్లతో 67 రన్స్ చేశాడు. కీలక వికెట్లను తీసిన జడేజాకు ప్టేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.