తిప్పేసిన పంజాబ్ తలవంచిన చెన్నై
స్వంత గడ్డపై ఊహించని పరాజయం
చెన్న – జోరు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్ కు ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది పంజాబ్ కింగ్స్ ఎలెవన్. ఆ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ముందుగా చెన్నైని తక్కువ స్కోర్ కే కట్టడి చేసింది. బౌలర్ల దెబ్బకు ఒక్క రుతురాజ్ గైక్వాడ్ తప్ప మిగతా వాళ్లు ఎవరూ ఆశించిన రాణించ లేక పోయారు. ప్రధానంగా స్టేడియం మొత్తం చప్పట్లతో స్వాగతం పలికిన మహేంద్ర సింగ్ ధోనీ షాట్ కొట్టబోయి పెవిలియన్ దారి పట్టాడు. దీంతో తక్కువ స్కోర్ కే చెన్నై చాప చుట్టేసింది.
కోల్ కతా వేదికగా జరిగిన కీలక పోరులో అరుదైన రికార్డు నమోదు చేసింది పంజాబ్ కింగ్స్. భారీ టార్గెట్ ను అవలీలగా ఛేదించింది. తాజాగా జరిగిన కీలక లీగ్ పోరులో చెన్నైని అద్భుతమైన బంతులతో బోల్తా కొట్టించింది. దీంతో చెన్నైకి పరాజయం తప్పలేదు.
ఆతిథ్య జట్టును 163 పరుగులకే రిస్ట్రిక్ట్ చేసింది. అనంతరం కేవలం 17.5 ఓవర్లలోనే టార్గెట్ ను పూర్తి చేసింది. ఏకంగా 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. రుతురాజ్ ఒక్కడే 48 బంతులు ఎదుర్కొని 5 ఫొర్లు 2 సిక్సర్లతో 62 రన్స్ చేశాడు.
ఇక పంజాబ్ స్పిన్నర్లు చాహర్ 16 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీస్తే హర్ ప్రీత్ బ్రార్ 17 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్ పరంగా చూస్తే బెయిర్ స్టో 46 రన్స్ చేస్తే రూసో 43 పరుగులతో దుమ్ము రేపారు. మొత్తంగా హర్ ప్రీత్ కు అవార్డు దక్కింది.