134 పరుగులకే చాప చుట్టేసింది
చెన్నై – స్వంత మైదానంలో జరిగిన కీలకమైన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ సత్తా చాటింది. ఛేజింగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బోల్తా పడింది. నిన్నటి దాకా పరుగల వరద పారించిన ఆటగాళ్లు వీరేనా అన్న అనుమానం కలుగుతోంది. భారీ స్కోర్లతో విరుచుకు పడిన హైదరాబాద్ ను మట్టి కరిపించింది సీఎస్కే.
అటు బ్యాటింగ్ లో రుతురాజ్ గైక్వాడ్ , మిచెల్ , శివం దూబే రెచ్చి పోతే , 2 పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు కెప్టెన్. ఇక మిచెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆఖరున వచ్చిన శివం శివమెత్తాడు. ఒక ఫోర్ 4 సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్కే 212 పరుగులు చేసింది.
అనంతరం మైదానంలోకి వచ్చిన హైదరాబాద్ ఛేదనలో బోల్తా పడింది. వెంట వెంటనే వికెట్లను పారేసుకుంది. ప్రధానంగా చెన్నై బౌలర్లు అద్బుతమైన బంతులు వేసి కట్టడి చేశారు. అందరినీ ఔట్ చేసి గ్రాండ్ విక్టరీ నమోదు చేశారు.
చెపాక్ స్టేడియంలో తుషార్ దేశ్ పాండే తన అద్భుతమైన బౌలింగ్ తో మాయ చేశాడు. కేవలం 27 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్లు కూల్చాడు. ఇక శ్రీలంక క్రికెటర్ పథిరాన 27 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసి హైదరాబాద్ నడ్డి విరిచారు. ఈ భారీ గెలుపుతో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్ లో విచిత్రం ఏమిటంటే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న మిచెల్ ఏకంగా 5 క్యాచ్ లు పట్టాడు.