చెన్నై కింగ్స్ ధనా ధన్
3 వికెట్లు కోల్పోయి 212
చెన్నై – స్వంత మైదానంలో దుమ్ము రేపింది చెన్నై సూపర్ కింగ్స్ . సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ తో జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో సూపర్ షో చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ స్కోర్లతో ప్రత్యర్థుల జట్లకు చుక్కలు చూపిస్తూ వస్తున్న ఎస్ ఆర్ హెచ్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు గైక్వాడ్ ..మిచెల్.
మైదానం నలుమూలల షాట్స్ కొట్టారు. కేవలం 2 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. 98 పరుగులు చేశాడు. డారిల్ మిచెల్ తానేమీ తక్కువ కాదని 52 రన్స్ తో హోరెత్తించాడు. వరుస పరాజయాలతో తంటాలు పడుతున్న సీఎస్కేకు ఈ స్కోర్ మరింత ఊపు ఇచ్చేలా చేసింది. ఇక రుతురాజ్, మిచెల్ కు తోడుగా శివమ్ దూబే శివమెత్తాడు. చివరలో వచ్చిన శివం 39 రన్స్ చేశాడు.
దీంతో భారీ స్కోర్ సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్న కమిన్స్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆది లోనే స్టార్ బ్యాటర్ రహానే 8 రన్స్ కే ఔట్ అయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన రుతురాజ్ ఎక్కడా తగ్గలేదు. కొట్టుకుంటూ వెళ్లి పోయాడు. మిచెల్ తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.