మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వేముల వీరేశంను న్యూడ్ వీడియో కాల్స్ తో బ్లాక్ మెయిల్ చేసిన సైబర్ నేరగాళ్లను గుర్తించారు పోలీసులు. వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిగా గర్తించినట్లు తెలిపారు. వారం రోజుల కిందట వేముల వీరేశంకు న్యూడ్ వీడియో కాల్ చేశారు. ఆ తర్వాత వాట్సాప్ నెంబర్‌కు స్క్రీన్ రికార్డు పంపి డబ్బులు డిమాండ్ చేశారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్ పోలీసుల సహకారంతో నిందితులను నకిరేకల్‌కు తీసుకొచ్చారు. వారిని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ కు తరలించారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే వేముల వీరేశం బహిరంగంగా మీడియాతో మాట్లాడారు. ఎవరైనా సరే సైబర్ నేరగాళ్ల గురించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఫోన్లు వస్తే తీయొద్దని కోరారు. ఇలా చేసినట్లయితే పెద్ద ఎత్తున మనను మోసం చేసే ప్రమాదం ఉందన్నారు.
ఫుల్ భద్రత కలిగిన ఎమ్మెల్యేకే ఇలాంటి వేధింపులు తప్పలేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక నుంచి ఎవరైనా మొబైల్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని, తమ సమాచారాన్ని ఎవరికీ షేర్ చేయొద్దంటూ సూచించారు సైబర్ క్రైమ్ పోలీసులు.