హెచ్చరించిన నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం
హైదరాబాద్ – సైబర్ నేరగాళ్లు రెచ్చి పోతున్నారు. టెక్నాలజీని అడ్డం పెట్టుకుని మోసాలకు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీరి బారిన అన్ని వర్గాలకు చెందిన వారు బాధితులుగా మారి పోతున్నారు. మరికొందరు తెలియక లక్షల డబ్బులను కోల్పోతున్నారు. మరికొందరు బయటకు చెప్పుకోలేక లోలోపట కుమిలి పోతున్నారు. ఇంకొందరు ధైర్యం చేసి ముందుకు వస్తున్నారు. వీరి బండారం బయట పెడుతున్నారు.
తాజాగా సైబర్ నేరగాళ్లు ఏకంగా అధికారంలో ఉన్న నల్లగొండ జిల్లాకు చెందిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను టార్గెట్ చేశారు. ఆయనకు న్యూడ్ వీడియో కాల్ చేశారు. ఆపై రికార్డ్ చేశారు. ఆ తర్వాత డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. ఇవ్వక పోతే వెంటనే సోషల్ మీడియాలో దానిని పోస్ట్ చేస్తామంటూ బెదిరింపులకు గురి చేశారు.
దీంతో మనోడు తేరుకున్నాడు. వీరి బారిన పడకుండా ఉండేందుకు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. దీంతో సైబర్ క్రైమ్ అధికారులు ఆ నెంబర్ ను బ్లాక్ చేయాలని సూచించారు. దీంతో వెంటనే తనకు వచ్చిన న్యూడ్ కాల్ ను హోల్డ్ లో పెట్టాడు వేముల వీరేశం. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. తాను గనుక ముందు జాగ్రత్తగా తేరుకున్నానని, దయచేసి ఎవరూ మోస పోవద్దని కోరారు.