Monday, April 21, 2025
HomeNEWSANDHRA PRADESHఅల్ప పీడ‌నం భారీ వ‌ర్షం

అల్ప పీడ‌నం భారీ వ‌ర్షం


హెచ్చ‌రించిన వాతావ‌ర‌ణ శాఖ

అమ‌రావ‌తి – నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం. సముద్ర మట్టం నుండి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది ఏపీ వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. రానున్న 12 గంటల్లో దాదాపు వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరం వైపు వెళ్లే అవకాశం ఉంద‌ని పేర్కొన్నారు వాతావ‌ర‌ణ శాఖ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ రోణంకి కూర్మ‌నాథ్.

దాదాపు ఉత్తరం దిశగా ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంబడి పయనించే అవకాశం ఉందని, దీని కార‌ణంగా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

అంతేకాకుండా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని జాగ్ర‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు.

డిసెంబ‌ర్ 20న శుక్ర‌వారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు డాక్ట‌ర్ రోణింకి కూర్మ‌నాథ్.

పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments