NEWSANDHRA PRADESH

ఏపీకి రుతు ప‌వ‌నాల తాకిడి

Share it with your family & friends

త్వ‌ర‌లోనే భారీగా వ‌ర్షాలు

అమ‌రావ‌తి – ఏపీకి రుతు ప‌వ‌నాల తాకిడి మొద‌లైంది. ఇప్ప‌టికే కేరళకు ఆనుకుని అరేబియా సముద్రంతో పాటు బంగాళాఖాతం, కోస్తాంధ్రల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు నెల‌కొన్నాయి.. వీటి కార‌ణంగా ఇప్పటికే కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లో భారీగా కురుస్తున్నాయి వ‌ర్షాలు.

రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలోని అనేక చోట్ల వర్షాలు కురుస్తాయ‌ని ఏపీ వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. రెండు, మూడు రోజుల్లో రాయలసీమలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశంచే సూచనలు ఉన్నాయ‌ని పేర్కొంది.

ఇవాళ అల్లూరి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో వ‌ర్షాలు కుర‌వ‌డం ప్రారంభ‌మ‌య్యాయి. ఇక కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీగా వ‌ర్షాలు కురిసే ఛాన్స్ ఉంద‌ని పేర్కొంది.

శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ వెల్ల‌డించింది.

విశాఖలో ఆకాశం మేఘావృతం, ఉరుములు మెరుపులతో జల్లులు కురుస్తున్నాయి.