NEWSANDHRA PRADESH

ఏపీలో వ‌ర్షాలు కురిసే ఛాన్స్

Share it with your family & friends

కోస్తాంధ్ర‌లో తేలిక‌పాటి వ‌ర్షాలు

అమ‌రావ‌తి – రాష్ట్ర వాతావ‌ర‌ణ కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాబోయే ఐదు రోజుల‌లో భారీ ఎత్తున ఏపీలో వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌క‌టించింది. ఇక కోస్తాంధ్ర‌లో కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఏపీ విప‌త్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మ‌నాథ్ వెల్ల‌డించారు.

ఏపీలోని విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు ఎండీ రోణంకి కూర్మ‌నాథ్.

ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో 36 మిమీ, నెల్లూరు జిల్లా దుత్తలూరులో 32.7మిమీ, వరికుంట పాడు 28.5మిమీ, అనంతపురం జిల్లా యాడికిలో 26మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.