దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల జాబితా
వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ – కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బుధవారం ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులను 2024 సంవత్సరానికి సంబంధించి ప్రకటించింది.
ఉత్తమ నటుడిగా అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ చిత్రానికి గాను బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ను ఎంపిక చేసింది. ఉత్తమ దర్శకుడిగా యానిమల్ మూవీ తీసిన వంగా సందీప్ రెడ్డి, ఉత్తమ నటిగా జవాన్ చిత్రానికి గాను నయన తార, ఉత్తమ నటుడు క్రిటిక్స్ విభాగంలో విక్కీ కౌశల్ ను ఎంపిక చేసింది జ్యూరీ.
ఇక ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడిగా యానిమల్ చిత్రానికి సంబంధించి బాబీ డియోల్ , ఉత్తమ సంగీత దర్శకుడిగా జవాన్ చిత్రానికి గాను అనిరుద్ రవిచందర్ , ఉత్తమ నేపధ్య గాయకుడిగా వరుణ్ జైన్ తేరే వాస్తే పాటకు ఎంపిక చేసింది.
టెలివిజన్ సీరీస్ లో ఉత్తమ నటిగా రూపాలీ గంగూలీ, ఉత్తమ నటుడిగా నీల్ భట్ , వెబ్ సీరీస్ లో ఉత్తమ నటిగా కరిష్మా తన్నా ఎంపికయ్యారు. అంతే కాకుండా చలన చిత్ర పరిశ్రమకు అత్యుత్తమ సహకారం అందించినందుకు గాను మౌసమి చటర్జీని ఎంపిక చేసింది.