డిప్యూటీ సీఎంతో బీజేపీ చీఫ్ భేటీ
కీలక అంశాలపై ఇద్దరు చర్చలు
ఢిల్లీ – ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఆయన కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అనంతరం పార్లమెంట్ సమావేశాలలో బిజీగా ఉన్నప్పటికీ ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ కు టైం ఇవ్వడం విశేషం. దీంతో కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కీలకమైన వ్యక్తిగా మారి పోయారు.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఢిల్లీలో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన, టీడీపీ , భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలు హాజరయ్యారు. విచిత్రం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలు సైతం పాల్గొనడం విశేషం.
ఈ సందర్బంగా భారతీయ జనతా పార్టీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సైతం ఈ విందుకు హాజరయ్యారు. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరూ దేశ, రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ప్రధానంగా రాష్ట్ర అభివృద్దికి నిధులు తీసుకు వచ్చేలా పార్టీ పరంగా కృషి చేయాలని సూచించారు పవన్ కళ్యాణ్ దగ్గుబాటి పురందేశ్వరితో. మొత్తంగా పార్టీలు వేరైనా కలిసి ముందుకు నడవాలని నిర్ణయం తీసుకున్నారు.