ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి
అమరావతి – బీజేపీ ఏపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అల్లు అర్జున్ కేసుపై స్పందించారు. ఆయనకు వంత పాడారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఎవరో ప్రేరేపించింది కాదన్నారు. హీరోగా అల్లు అర్జున్ థియేటర్ వద్దకు వెళ్లారని, ప్రచారం కోసం కాదన్నారు. కేసులో మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా ఏ11గా ఉన్న హీరోను ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. ఆయన అరెస్ట్ అక్రమం అన్నారు ఎంపీ.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం, దానికి సంబంధించిన కేసుపై నిప్పులు చెరిగారు శాసనసభ వేదికగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి . హీరోను ఏకి పారేశారు. ఆయన ఏం సాధించారంటూ సినీ సెలిబ్రిటీలు పరామర్శించారో చెప్పాలని అన్నారు.
పోలీసులు చెప్పినా పట్టించు కోలేదని, చివరకు డీసీపీ అరెస్ట్ చేయాల్సి వస్తుందంటూ హెచ్చరించడంతో అల్లు అర్జున్ అక్కడి నుంచి వెళ్లి పోయాడని, పోతూ పోతూ కూడా ఫ్యాన్స్ మరింత గుమిగూడేలా అభివాదం చేసుకుంటూ వెళ్లారని ఆరోపించారు.
ఈ ఘటనలో ఓ మహిళ చని పోయింది. మరో బాబు చావు బతుకుల మధ్య ఉన్నాడని, ఎందుకు పరామర్శించ లేదని ప్రశ్నించారు.