పవన్ కళ్యాణ్ చర్యలు భేష్ – పురందేశ్వరి
షాకింగ్ కామెంట్స్ చేసిన బీజేపీ చీఫ్
అమరావతి – ఏపీ భారతీయ జనతా పార్టీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని కాకినాడ ఓడ రేవు నుంచి అక్రమంగా తరలిపోతున్న బియ్యం వ్యవహారానికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల తీసుకున్న చర్యల పట్ల స్పందించారు.
ఈ సందర్బంగా ఆయన తీసుకున్న నిర్ణయం సరైనదేనని స్పష్టం చేశారు దగ్గుబాటి పురందేశ్వరి.
పీడీఎస్ బియ్యంపై డిప్యూటీ సీఎం పవన్ చర్యలు మంచివేనంటూ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా పీడీఎస్ రైస్ గురించి మాట్లాడామని చెప్పారు పురంధేశ్వరి.
అంతర్జాతీయ పీడీఎస్ మాఫియాగా మారిందంటూ పవన్ కళ్యాణ్ చేసిన మాటల్లో తప్పు లేదన్నారు. తమ పార్టీ నుంచి ఆదినారాయణ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడును కలిశారని , కానీ టీడీపీ నుంచి జేసీ ప్రబాకర్ రెడ్డి కలవలేదని తెలిసిందన్నారు. ఫ్లైయాష్ అంశంలో తుది నిర్ణయం చంద్రబాబు తీసుకుంటారని చెప్పారు.