గీతోపదేశం ప్రాతః స్మరణీయం
బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి
అమరావతి – ఈ భూమి మీద తొలి తత్వవేత్త శ్రీకృష్ణుడు అని పేర్కొన్నారు భారతీయ జనతా పార్టీ ఏపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి. ఆగస్టు 26న సోమవారం దేశ వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం ఘనంగా జరుపుకుంటున్నారు.
ఈ సందర్బంగా స్పందించారు ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి. శ్రీకృష్ణుడి గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. ఆయన ప్రవచించిన గీతోపదేశం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రభావితం అయ్యారని..ఇంకా గీతను ప్రేమిస్తూనే ఉన్నారని కొనియాడారు ఎంపీ.
జీవితంలో ఏదైనా ఒక పని మొదలు పెట్టాలన్నప్పుడు మనసులో ఎన్నో సందేహాలు వచ్చి అడుగు ముందుకు పడదన్నారు. అలాంటి సమయంలో మనల్ని ముందడుగు వేయించే స్ఫూర్తిని భగవద్గీత అందిస్తుందని ప్రశంసలు కురిపించారు దగ్గుబాటి పురందేశ్వరి.
అటువంటి జీవన సారాన్ని మానవాళికి అందించిన శ్రీ కృష్ణుని జన్మదినాన్ని భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్న ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ.