టీటీడీ బోర్డు నిర్ణయం సబబే – పురంధేశ్వరి
హిందూయేతరులు ఎలా సేవలు అందిస్తారు
అమరావతి – ఏపీ భారతీయ జనతా పార్టీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె జాతీయ మీడియాతో మాట్లాడారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతించారు. గత కొంత కాలంగా హిందూయేతరుల సేవలు అందజేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని , గత వైసీపీ సర్కార్ మరింత పెంచి పోషించిందని ఆరోపించారు ఎంపీ.
ఇదిలా ఉండగా తాజాగా టీటీడీ బోర్డు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో పని చేస్తున్న ఇతర మతస్తులకు చెందిన ఉద్యోగులు పని చేయడానికి వీలు లేదని పేర్కొన్నారు టీటీడీ చైర్మన్. అంతే కాకుండా వారిని ఇతర శాఖలకు బదిలీ చేయడమో లేదా స్వచ్చంధ పదవీ విరమణ చేయించడమో చేయాలని , ఈ మేరకు కూటమి సర్కార్ కు లేఖ రాస్తామని ప్రకటించారు.
దీనిపై దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. టీటీడీ చైర్మన్ నిర్ణయం స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇందులో తప్పేమీ లేదన్నారు. హిందూ భక్తులకు అన్య మతస్తులు ఎలా సేవలు అందిస్తారని ప్రశ్నించారు ఎంపీ. దీనిపై రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు .