ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవికి ఎన్నిక
అమరావతి – ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవి అడ్డురి శ్రీరామ్ కు దక్కడం అభినందనీయమని అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి. పార్టీ బలోపేతం కోసం తొలినాళ్ల నుంచి ఎంతగానో కష్టపడ్డారని కొనియాడారు. అధ్యక్ష పదవి కోసం 15 మంది పోటీ పడ్డారని, చివరకు శ్రీరామ్ ను వరించిందని చెప్పారు.
ప్రతి మూడు ఏళ్ల కోసం సంస్థాగత ఎన్నికలు నిర్వహించడం పార్టీ పరంగా కొనసాగుతూ వస్తోందన్నారు. ఈ జిల్లాలో 900 పోలింగ్ బూత్ లు కమిటీ వేశామన్నారు.
అందరి అభిప్రాయం మేరకు జిల్లా అధ్యక్ష పదవిని ఎన్నికోవటం జరిగిందన్నారు.అందరి అభిప్రాయాల మేరకు శ్రీరామ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు దగ్గుబాటి పురందేశ్వరి. అడ్డురి శ్రీరామ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవిలో మూడు సంవత్సరాలు కొనసాగుతారని స్పష్టం చేశారు.
కార్యకర్తల అభిప్రాయాలూ తీసుకోవడం జరిగిందన్నారు. శ్రీరామ్ తో పాటు 4 పేర్లు వచ్చాయని తెలిపారు.
పార్టీ ని బలోపేతం చేయటంలో శ్రీరామ్ పనితీరు పార్టీ గుర్తించిందన్నారు. పదవిలో ఉన్నంత కాలం శ్రీరామ్ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు దగ్గుబాటి పురందేశ్వరి.