ఏపీలో బీజేపీనే ప్రధాన ప్రతిపక్షం
స్పష్టం చేసిన దగ్గుబాటి పురందేశ్వరి
అమరావతి – భారతీయ జనతా పార్టీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన గాడి తప్పిందన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. శాసన సభ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ ఏపీలో అత్యంత బలీయమైన శక్తిగా మారబోతోందని ఆశా భావం వ్యక్తం చేశారు.
ప్రధాన ప్రతిపక్షంగా మార బోతోందని జోష్యం చెప్పారు దగ్గుబాటి పురందేశ్వరి. గత కొంత కాలంగా బీజేపీ అనేక సమస్యలపై పోరాడిందని ఈ విషయం ప్రజలకు తెలుసన్నారు. పొత్తు గురించి పదే పదే మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు.
రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్న జగన్ రెడ్డిని ఇంటికి పంపించడం ఖాయమని పేర్కొన్నారు. కేంద్రం నుంచి మంజూరైన నిధులతో తన పేరు వేసుకుంటూ ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు దగ్గుబాటి పురందేశ్వరి.
రాబోయే రోజుల్లో ప్రతి సమస్యను తాము వెలుగులోకి తీసుకు వస్తామన్నారు. ప్రజల పక్షాన తాము పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్దికి కేంద్రం తోడ్పాటు అందించిందని కానీ ఎక్కడా జగన్ రెడ్డి దీని విషయంపై ప్రస్తావించక పోవడం దారుణమన్నారు.