బీజేపీ విజయం ప్రజలకు అంకితం
ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కామెంట్
అమరావతి – భారతీయ జనతా పార్టీ చీఫ్ , తాజాగా ఎంపీగా గెలుపొందిన దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం బీజేపీ రాజమండ్రి జిల్లా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల పదాధికారులు పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయానికి కృషి చేసిన పార్టీ రాజమండ్రి జిల్లా ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియ చేశారు. రానున్న రోజుల్లో పార్టీ నిర్మాణంలో నిర్వహించాల్సిన కీలక పాత్రపై సమావేశంలో దిశానిర్దేశం చేశారు.
ఎవరూ ఊహించని రీతిలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టారని ఇది చరిత్రాత్మకమని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి గెలుపు వస్తుందని ముందే ఊహించామన్నారు. రాక్షస పాలనకు ప్రజలు చరమ గీతం పాడారని, అహంకారం ఎప్పటికీ చెల్లుబాటు కాదని తేల్చి చెప్పారన్నారు.
విజ్ఞతతో విలువైన ఓటును తమకు వేసి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు దగ్గుబాటి పురందేశ్వరి.