సీఎస్ఆర్ కింద మరిన్ని పనులు చేపట్టాలి
బీజేపీ చీఫ్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి
అమరావతి – సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఆయా సంస్థలు, వ్యక్తులు ముందుకు రావాలని తమ వంతుగా సహాయ సహకారాలు అందజేయాలని పిలుపునిచ్చారు భారతీయ జనతా పార్టీ చీఫ్ , రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి.
శుక్రవారం ఒఎన్జీసీ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ (సీఎస్ఆర్)లో భాగంగా కారంచేడులోని లైబ్రరీ చెరువులో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను ప్రారంభించడం జరిగింది.
ఆక్వాటికా ఫ్రోజ్ ఫుడ్స్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కమ్యూనిటీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం కోసం కోటి రూపాయల విరాళం ఇవ్వడం పట్ల అభినందించారు.. ఈ ప్లాంట్ నిర్మాణం కోసం ఈరోజు భూమిపూజ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు దగ్గుబాటి పురందేశ్వరి.
ఇదే సమయంలో సీఎస్ఆర్ కింద మరిన్ని ప్రజలకు , సమాజానికి ఉపయోగపడేలా పనులు చేపట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దీని వల్ల కొంత మేరకు సమాజానికి ఉపయోగ పడినట్లు అవుతుందన్నారు.