బహుజనుల అభివృద్దికి కృషి చేస్తా
బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి
రాజమండ్రి – రాష్ట్రంలో వెనుకబడిన, బహుజన, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి. శనివారం రాజమండ్రిలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
రాష్ట్రంలో రాచరిక పాలన పోయే కాలం వచ్చిందన్నారు. జగన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు. రాష్ట్రం కోసం, ప్రజల ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని చెప్పారు.
బీసీలు అన్ని రంగాలలో ముందంజలో ఉండేలా చూస్తానని అన్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారన్న విషయం మరిచి పోవద్దన్నారు. కూటమికి ఆయా సామాజిక వర్గాలు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు.
దేశ వ్యాప్తంగా బహుజనులంతా భారతీయ జనతా పార్టీకి గంప గుత్తగా సపోర్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో మోదీ గాలి వీస్తోందన్నారు. బీజేపీ గెలుపు పక్కా అన్నారు.