NEWSANDHRA PRADESH

మహిళా స‌మ‌స్య‌ల‌పై ఫోక‌స్ – ద‌గ్గుబాటి

Share it with your family & friends

కామ‌న్వెల్త్ కాన్ఫ‌రెన్స్ లో అంశాల‌పై చ‌ర్చ

అమ‌రావ‌తి – ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ , రాజ‌మండ్రి ఎంపీ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల సిడ్నీ లో జరిగిన‌ కామన్ వెల్త్ సమావేశం లో భారత్ ప్రతినిధి గా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఎంపీ మీడియాతో మాట్లాడారు.

మహిళా ఎమ్మెల్యే లను సమన్వయం చేసుకుంటూ నెల‌కొన్న‌ సమస్యలకు సంబంధించి పరిష్కారం ఎలా చేయాల‌నే దానిపై చర్చ సాగిందన్నారు ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి. ప్ర‌పంచం ఎదుర్కొంటున్న‌ అనేక అంశాలు పై చర్చించడం జ‌రిగింద‌ని చెప్పారు.

మహిళలు ఎదుర్కొనే సమస్యలు, దురాచారాలు, వేధింపులపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్ట‌డం జ‌రిగింద‌న్నారు.
సోషల్ మీడియా లో వచ్చే పోస్ట్ లపై మహిళా ప్రజా ప్రతినిధులు మానసికంగా కుంగి పోతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి.

ఇటువంటి అంశాల పై వారిలో మానసిక స్థైర్యం కల్పించేలా సెమినార్ లు నిర్వహిస్తామ‌ని అన్నారు.
ఉద్దేశ పూర్వకంగా చేసే దుష్ప్ర‌చారం పై సైబర్ క్రైం కింద కేసులు పెడతామ‌ని హెచ్చ‌రించారు బీజేపీ చీఫ్‌.

సిడ్నీలో జరిగిన ఈ కాన్ఫ‌రెన్స్ లో త‌న‌ను మహిళా ఎంపిగా వారికి ఛైర్మన్ గా స్పీకర్ త‌న‌ను పంపించార‌ని తెలిపారు ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి.