ధర్మాన కామెంట్స్ దగ్గుబాటి సీరియస్
ఎన్నికల రూల్స్ కు విరుద్దం
అమరావతి – బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావును ఏకి పారేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు. బీజేపీకి రోజు రోజుకు జనాదరణ పెరుగుతోందని చెప్పారు. తాము కీలకమైన పాత్ర పోషించ బోతున్నామని, ఎన్నికల ఫలితాలే అవి చెబుతాయని పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఓటరు ను పోలింగ్ బూత్ వరకూ తీసుకు రావడానికి చేయాల్సిన పనులపై చర్చించడం జరిగిందన్నారు. దొంగ ఓట్ల అంశంలో ఎలక్షన్ కమిషన్ ఫోకస్ పెట్టాలని సూచించారు దగ్గుబాటి పురందేశ్వరి.
మంత్రి ధర్మాన వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ ఆరోపించారు. వాలంటీర్లు బూత్ ఏజెంట్లుగా ఉండాలని చెప్పడం ప్రజాస్వామ్యం అనిపించు కోదన్నారు. ఈసీ ఆదేశాలకు విరుద్దంగా ప్రవర్తించడాన్ని తాము తప్పు పడుతున్నామని అన్నారు.
వాలంటీర్లు ఫ్యాన్ గుర్తుపై ఓటేసేలా చేయాలని ముఖ్యమంత్రి జగన్ సభలో చెప్పడం దారుణమన్నారు. ఈ విషయాన్ని ఈసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు పురంధేశ్వరి. వీటిని పొందు పరుస్తూ సీఈసీకి లేఖ రాశానని చెప్పారు. పొత్తుపై హై కమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.