స్పీకర్ రేసులో పురందేశ్వరి
ఏపీ అభివృద్దిపై ఫుల్ ఫోకస్
అమరావతి – ఏపీ భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి చర్చనీయాంశంగా మారారు. ఆమె రాజమండ్రి ఏంపీగా గెలుపొందారు. ఆమె బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో అటు శాసన సభలో ఇటు లోక్ సభలో గణనీయమైన ఫలితాలు రావడం ఒకింత సంతోషాన్ని ఇచ్చేలా చేశాయి.
ఈ సందర్బంగా తాజాగా ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో ఎన్డీయే, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ఏపీలో గతంలో ఎన్న జగన్ రెడ్డి సర్కార్ సర్వ నాశనం చేసిందని ఆరోపించారు దగ్గుబాటి పురందేశ్వరి.
ఇదే సమయంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూనే ప్రస్తుతం రాష్ట్ర అభివృద్దికి నిధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. ఏపీకి కేంద్ర మంత్రి వర్గంలో పెద్ద ఎత్తున మోడీ ప్రయారిటీ ఇచ్చారని గుర్తు చేశారు దగ్గుబదటి పురందేశ్వరి.
అయితే తనకు లోక్ సభ స్పీకర్ పదవి వస్తుందని జరుగుతున్న ప్రచారంపై ఆమె మాట్లాడేందుకు నిరాకరించారు. ఏది ఏమైనా జగన్ రెడ్డి సర్కార్ ను కూల్చడంలో ప్రజలు నిర్వహించిన పాత్ర గొప్పదన్నారు.