కూటమి సత్తా ఏంటో చూపించాలి
బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి
అమరావతి – బీజేపీ కూటమి సత్తా ఏమిటో ఈసారి జరగబోయే ఎన్నికల్లో చూపించాలని పిలుపునిచ్చారు ఆ ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి . రాజమండ్రిలో ఎంపీగా బరిలో ఉన్నారు. ఈ సందర్బంగా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ తాను ఒక్కడే రాజ్యం ఏలుతున్నాడంటూ జగన్ రెడ్డిని ఉద్దేశించి మండిపడ్డారు. ఇవాళ రాష్ట్రం బాగు పడాలన్నా, అభివృద్ది లోకి రావాలంటే బీజేపీ కూటమికి అధికారం ఇవ్వాలని సూచించారు.
నరేంద్ర మోదీ స్పూర్తి, చంద్రబాబు నాయుడులోని యుక్తి, పవన్ కళ్యాణ్ లోని శక్తి కలిస్తే ఇక ఎవరూ ఆపలేరన్నారు. ఇది త్వరలోనే జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రూఢీ కావడం ఖాయమని జోష్యం చెప్పారు పురందేశ్వరి. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారని, ఇక జగన్ రెడ్డిని భరించే స్థితిలో లేరన్నారు బీజేపీ చీఫ్. ఇదిలా ఉండగా రాజమండ్రిలో పురందేశ్వరి సమక్షంలో పలువురు బీజేపీ కండువా కప్పుకున్నారు.