సీఎం మాన్ పై చీమా సీరియస్
సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై హత్యాయత్నం
పంజాబ్ – శిరోమణి అకాలీదళ్ సీనియర్ లీడర్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై పంజాబ్ స్వర్ణ దేవాలయం వద్ద ఖలిస్తాన్ ఉగ్రవాది దాడికి యత్నించాడు. కాల్పులు జరిపేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన శిరోమణి కార్యకర్తలు ఉగ్రవాదిని పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.
ఇదిలా ఉండగా ఈ ఘటనపై శిరోమణి అకాలీదళ్ నాయకుడు దల్జీత్ సింగ్ చీమా తీవ్రంగా ఖండించారు. మీడియాతో మాట్లాడారు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడి పంజాబ్‌ను అస్థిరపరిచే లక్ష్యంతో జరిగిన పెద్ద కుట్రగా అభివర్ణించారు.
“ఆలయ ప్రవేశద్వారం వద్ద ‘సేవాదర్’గా పనిచేస్తున్న సుఖ్బీర్ సింగ్ బాదల్ పై కాల్పులు జరిగాయి. అతని ప్రాణాలను కాపాడినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని చీమా చెప్పారు.
రాష్ట్ర భద్రతకు భరోసా ఇవ్వడానికి ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఏమి చేశారని ప్రశ్నించారు. గతి తప్పిన లా అండ్ ఆర్డర్ కు ఈ ఘటన ఓ నిదర్శనమని మండిపడ్డారు.