పైరవీలకు పాతర బదిలీల జాతర
ఆరోగ్య శాఖలో సంరక్షణ సేవలు భేష్
హైదరాబాద్ – రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్య శాఖా పరంగా సేవలు అద్భుతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇదిలా ఉండగా బదిలీలలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వస్తున్న ప్రచారాన్ని ఖండించారు. అందులో వాస్తవం లేదన్నారు. ఆస్పత్రుల పనితీరుకు ఆటంకం లేకుండా పూర్తి పారదర్శకంగా బదిలీలు చేపట్టామని స్పష్టం చేశారు ఆరోగ్య శాఖ మంత్రి.
జీవో నెంబర్ 80 ప్రకారం దీర్ఘకాలంగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న 40 ఉద్యోగుల సర్వీసును గుర్తించి బదిలీ చేయడం జరిగిందని తెలిపారు. అయితే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులలో ఎమర్జెన్సీ సేవలను పరిగణలోకి తీసుకుని వైద్యులకు మినహాయింపు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు దామోదర రాజ నరసింహ.
వైద్యులు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ను కాంట్రాక్టు పద్ధతిన ఈ ఏడాది మార్చిలో నియమించడం జరగిందని వెల్లడించారు. ఈనెల 9న తిరిగి నియమించుకునేందుకు షెడ్యూల్ రిలీజ్ చేశామని పేర్కొన్నారు.