NEWSTELANGANA

దామోద‌ర రాజ న‌ర‌సింహ స‌మీక్ష

Share it with your family & friends

ఆస్ప‌త్రులు..తీరు తెన్నుల‌పై ఆరా

హైద‌రాబాద్ – రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ‌ మంత్రి దామోదర్ రాజనర్సింహ వరద ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట జిల్లాల్లో ప్రభుత్వ ఆస్పత్రులు వాటి స్థితిగతులు, ఇతర వైద్య సదుపాయాల కల్పన పై స‌మీక్ష చేప‌ట్టారు.

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వ కార్యదర్శి డా. క్రిస్టినా, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్. వి. కర్ణన్, రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డా. రవీందర్ కుమార్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా . అజయ్ కుమార్ గార్లతో పాటు ఆయా జిల్లాల Collectors , DMHO లు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు.

గర్భిణీ స్త్రీల ఆరోగ్యం – 15 రోజుల లోపల ప్రసవం ఉన్న గర్బిణి మహిళల సంక్షేమానికై తీసుకున్న ముందస్తు చర్యలపై చర్చించారు.

మందులు వాటి నిల్వల స్థితి. ఆసుపత్రులకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు చేప‌ట్టాల‌ని ఆదేశించారు దామోద‌ర రాజ న‌ర‌సింహ‌.

అత్యవసర వాహనాలు అందుబాటులో ఉంచాల‌ని సూచించారు. టీకాలు, పారిశుద్ధ్యం ముఖ్యంగా హై రిస్కు గుర్తించిన ప్రాంతాల్లో ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాల‌న్నారు. ఇదే స‌మ‌యంలో పంచాయతీ రాజ్ , మునిసిపల్ శాఖలతో సమన్వయం చేసుకోవాల‌ని సూచించారు మంత్రి.

ప్రజలకు అందించాల్సిన వైద్య సేవలలో ఎటువంటి అంతరాయానికి చోటు లేకుండా జిల్లా కలెక్టర్లు , జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఫాగింగ్ , దోమల నివారణ చర్యలు కొరకు Vector Borne Deceases Control కోసం చర్యలు చేపట్టాలని స్ప‌ష్టం చేశారు.