నిమ్స్ సేవలు ప్రశంసనీయం
మంత్రి దామోదర రాజ నరసింహా
హైదరాబాద్ – వైద్యులకు మెరుగైన సేవలు అందించడంలో నిమ్స్ ముఖ్య పాత్ర పోషిస్తోందన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహా. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రి లో అడ్వాన్సుడ్ హై ఫైడ్లిటీ టెక్ ఎనేబుల్డ్ క్రిటికల్ కేర్ సిములేషన్ స్కిల్ లాబ్ ను ఆరోగ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తుతో పాటు యుఎస్ కౌన్సిల్ జనరల్ లర్సన్ తో కలిసి ప్రారంభించారు మంత్రి. అనంతరం స్కిల్ ల్యాబ్ డెమోను ప్రారంభించారు.
ఈ సందర్బంగా మంత్రి దామోదర రాజ నరసింహా మాట్లాడారు. తమ ప్రభుత్వం వైద్య రంగంపై ఎక్కువగా ఫోకస్ పెట్టిందన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విధుల్లో ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.
తమ సర్కార్ ప్రధానంగా విద్య, వైద రంగానికి అత్యధికంగా ప్రయారిటీ ఇస్తోందని స్పష్టం చేశారు మంత్రి. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. కొత్తగా మెడికల్ కాలేజీలను కూడా మంజూరు చేశామన్నారు. త్వరలోనే అన్ని ఖాళీలను గుర్తించి యుద్ద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదే సమయంలో నిమ్స్ ఎందరికో భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. మరింతగా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు దామోదర రాజ నరసింహా.