NEWSTELANGANA

కాలుష్య నియంత్ర‌ణ ముఖ్యం

Share it with your family & friends

మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ

సంగారెడ్డి జిల్లా – రోజు రోజుకు కాలుష్య కార‌కాల‌తో న‌గ‌రం నిండి పోతోంద‌ని దీనిని నియంత్రించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ‌. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో 104.24 కోట్ల రూపాయల తో నిర్మించిన (common effluent treatment plant) వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారాన్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో క‌లిసి దామోద‌ర ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన స‌మావేశంలో ప్ర‌సంగించారు.

పాశ మైలారం పారిశ్రామికవాడ లో ఆగ్ని ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన 3 ఫైర్ స్టేషన్ లను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నార‌ని తెలిపారు. ఇదే స‌మ‌యంలో అదనపు స్టాప్ ను నియమించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పారిశ్రామికవేత్తలు సూచ‌న‌లు చేశారని వీటిని తాను ఆమోదిస్తున్న‌ట్లు చెప్పారు దామోద‌ర రాజ న‌ర‌సింహ‌.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌తో పాటు వివిధ పరిశ్రమల సహకారంతో నిర్మించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా కాలుష్య నియంత్రణ మండలితో ఒప్పందం కుదుర్చు కోవ‌డాన్ని అభినందించారు. ఫార్మా, కెమికల్ రసాయనాలు తయారు చేసే సుమారు 60 రసాయన పరిశ్రమలకు రక్షణగా ఉంటుందన్నారు మంత్రి దామోదర రాజ న‌ర‌సింహ‌.