NEWSTELANGANA

ఆరోగ్యంతో చెల‌గాటం ఆడితే చ‌ర్య‌లు

Share it with your family & friends

హెచ్చ‌రించిన మంత్రి దామోదర‌

హైద‌రాబాద్ – గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో తెలంగాణ రాష్ట్ర ఆహార శాఖ జూలు విదిల్చింది. న‌గ‌రంలోని ప‌లు హోట‌ళ్లు, రెస్టారెంట్లు, బేక‌రీలు, బార్లు, త‌దిత‌ర వాటిపై దాడులు చేస్తోంది. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ శాంపిల్స్ సేక‌రిస్తూ చ‌ర్య‌ల‌కు దిగుతున్నారు. ఈ మ‌ధ్య‌న మాల్స్ ను కూడా త‌నిఖీ చేయ‌డంతో అస‌లు బండారం బ‌య‌ట ప‌డుతోంది. దీనికంత‌టికీ తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ప‌ర్య‌వేక్ష‌ణ అధికారుల బృందం ఉంద‌నేది వాస్త‌వం.

గ‌తంలో కొలువు తీరిన బీఆర్ఎస్ స‌ర్కార్ చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించింది. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ షాకింగ్ కామెంట్స్ చేశారు. స‌ద‌రు శాఖ‌పై స‌మీక్ష చేప‌ట్టారు.

ఫుడ్ సేఫ్టీ అన్న‌ది ముఖ్య‌మ‌ని, అన్ని చోట్లా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేప‌ట్టాల‌ని ఆదేశించారు మంత్రి. ఇందుకు సంబంధించి పుడ్ సేఫ్టీపై ఇత‌ర రాష్ట్రాల‌కు తెలంగాణ ఆద‌ర్శంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు.
నిబంధనలు, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంతో ఫుడ్ వ్యాపారం చేసే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఎవ‌రి ప్ర‌లోభాల‌కు లొంగాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు దామోద‌ర రాజ న‌ర‌సింహ‌.

రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ ఫుడ్ లాబ్స్ ద్వారా సుమారు 180 నుండి 200 ఫుడ్ శాంపిల్స్ లను టెస్టులు చేయాలని మంత్రి ఆదేశించారు.ప్రభుత్వ హాస్టల్స్, ప్రైవేటు బోర్డింగ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లు, బేకరీలు, డెయిరీ ఫుడ్ తయారీదారులు, రెస్టారెంట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్ తయారుదారులు లైసెన్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.