గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్
ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన కిషోర్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర గవర్నర్ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. బుధవారం సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ముఖ్య కార్యదర్శిగా ఉన్న బుర్రా వెంకటేశం వీఆర్ఎస్ తీసుకున్నారు. ఆయనను ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా నియమించింది. ఈ స్థానం ఖాళీగా ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉండగా దాన కిషోర్ ప్రస్తుతం కీలకమైన పదవులలో ఉన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఏ అండ్ యూడీ) శాఖకు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ పదవికి పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ)లో ఉంచారు.
దాన కిషోర్ 1996 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. మున్సిపల్ శాఖతో పాటు ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి సంబంధించిన పనుల కోసం వివిధ విభాగాలతో సమన్వయం చేయడానికి నోడల్ అధికారిగా నియమించింది సర్కార్.