పా రంజిత్ ను మరిచి పోలేను – డేనియల్
ప్రముఖ నటుడు కాల్టాగిరోన్ కామెంట్
తమిళనాడు – ప్రముఖ తమిళ దర్శకుడు పా రంజిత్ దర్శకత్వం వహించిన తంగలాన్ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విక్రమ్, పార్వతి, మాళవికా మోహన్ తో పాటు బ్రిటీష్ కు చెందిన నటుడు డేనియల్ కాల్టాగిరోన్ కీలక పాత్రలో నటించారు. ఈ సందర్బంగా మొదటగా సంశయించినా ఆ తర్వాత తను సినిమాలో లీనమైన విధానం గురించి పంచుకున్నాడు డేనియల్.
కొంత అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడినా ఆ తర్వాత పా రంజిత్ తో తంగలాన్ సినిమా తీస్తున్నంత సేపు తాను అందులో లీనమై పోయానని ప్రశంసలు కురిపించాడు. రాను రాను సినిమా అయి పోయిందా అని తాను ఆశ్చర్య పోయానని చెప్పాడు డేనియల్.
పా రంజిత్ ఒక్క ఇండియాలోనే కాదు యావత్ ప్రపంచంలో పేరు పొందిన దర్శకులలో ఒకడిగా పరిగణించడంలో తప్పు లేదన్నాడు. భారతీయ సంస్కృతి, తమిళ చిత్ర పరిశ్రమ గురించి తాను తెలుసుకునే అవకాశం ఈ సినిమాలో నటించడం వల్ల కలిగిందన్నాడు.
తన సినీ కెరీర్ లో చూసిన దర్శకులలలో పా రంజిత్ భిన్నమైన దర్శకుడు అంటూ కితాబు ఇచ్చాడు డేనియల్. ఈ మొత్తం ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు ఉన్నాయని పేర్కొన్నాడు. మొత్తంగా తంగలాన్ సినిమా కాదని అదొక దృశ్య కావ్యమని తెలిపాడు .