SPORTS

హెడ్ కోచ్ డేనియ‌ల్ వెటోరీ షాకింగ్ కామెంట్స్

Share it with your family & friends

ఇషాన్ కిష‌న్ ను కావాల‌నే తీసుకున్నాం

జెడ్డా – ఐపీఎల్ మెగా వేలం పాట‌లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ముంబైకి చెందిన ఇషాన్ కిష‌న్ ను తీసుకుంది. భారీ ధ‌ర వెచ్చించింది. వేలం పాట అనంత‌రం ఆ జ‌ట్టు హెడ్ కోచ్ డేనియ‌ల్ వెట్టోరీ మీడియాతో మాట్లాడాడు. కావాల‌నే త‌న‌ను తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నాడు.

ఇప్ప‌టికే త‌మ టీంలో పాట్ క‌మిన్స్ , ట్రావిస్ హెడ్ , అభిషేక్ శ‌ర్మ , హెన్రిచ్ క్లాసెన్ , నితీశ్ రెడ్డి ఉన్నార‌ని తెలిపాడు. వీరంతా జ‌ట్టుకు అద‌న‌పు బ‌లంగా ఉంటార‌ని చెప్పాడు. ఇషాన్ కిష‌న్ టాప్ క్రికెట‌ర్ల‌లో ఒక‌డు అని పేర్కొన్నాడు డేనియ‌ల్ వెటోరి.

అయితే ఇదే స‌మ‌యంలో తాము టి. న‌ట‌రాజ‌న్ ను కోల్పోవడం ఇబ్బందిక‌ర‌మేన‌ని అంగీక‌రించాడు. ఇది త‌మ జ‌ట్టుకు బిగ్ లాస్ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉండ‌గా వేలం పాట‌లో కిష‌న్ పై భారీ ధ‌ర‌కు తీసుకుంది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్. రూ. 11.25 కోట్లు వెచ్చించింది. ప్ర‌స్తుతం బీసీసీఐ త‌నను జ‌ట్టుకు ఎంపిక చేయ‌లేదు.

ఎస్ ఆర్ హెచ్ ఇషాన్ కిష‌న్ తో పాటు పేస‌ర్లు మ‌హ‌మ్మ‌ద్ ష‌మీని రూ. 10 కోట్లు, హ‌ర్ష‌ల్ ప‌టేల్ ను రూ. 8 కోట్లు వెచ్చించి తీసుకున్నారు సీఈవో కావ్య మార‌న్.