Monday, April 21, 2025
HomeSPORTSడారిల్ మిచెల్ హ‌ల్ చ‌ల్

డారిల్ మిచెల్ హ‌ల్ చ‌ల్

5 క్యాచ్ ల‌తో సూప‌ర్ ప‌ర్ ఫార్మెన్స్

చెన్నై – ఐపీఎల్ 2024లో భాగంగా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ స‌త్తా చాటింది. భారీ స్కోర్ల‌తో హోరెత్తిస్తూ ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించేలా చేస్తున్న స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది సీఎస్కే.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 212 ర‌న్స్ చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 98 ర‌న్స్ చేస్తే మిచెల్ 52 ర‌న్స్ హోరెత్తించాడు. చివ‌ర‌లో వ‌చ్చిన శివం దూబే శివ‌మెత్తాడు. 39 ర‌న్స్ తో కీల‌క పాత్ర పోషించాడు.

అనంత‌రం బ‌రిలోకి దిగిన స‌న్ రైజ‌ర్స్ కేవ‌లం 134 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. తుషార్ పాండే అద్భుత‌మైన ప‌ర్ ఫార్మెన్స్ తో ఆక‌ట్టుకున్నాడు. 4 ఓవ‌ర్ల‌లో 27 ర‌న్స్ ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ప‌తిరాన 27 ర‌న్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక ఈ మ్యాచ్ లో సూప‌ర్ ఫీల్డింగ్ తో ఆక‌ట్టుకున్నాడు డారిల్ మిచెల్. అటు బ్యాటింగ్ లో హాఫ్ సెంచ‌రీ చేస్తే ఫీల్డింగ్ ప‌రంగా ఏకంగా 5 క్యాచ్ లు ప‌ట్టుకుని ఔరా అనిపించాడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments